● రూ.1,10,250 చేరిన పీఎల్‌ఆర్‌ బోనస్‌ ● సింగరేణిలో పుట్టి.. కోలిండియాకు విస్తరణ | - | Sakshi
Sakshi News home page

● రూ.1,10,250 చేరిన పీఎల్‌ఆర్‌ బోనస్‌ ● సింగరేణిలో పుట్టి.. కోలిండియాకు విస్తరణ

Oct 5 2026 1:33 AM | Updated on Oct 5 2026 1:33 AM

● రూ.1,10,250 చేరిన పీఎల్‌ఆర్‌ బోనస్‌ ● సింగరేణిలో పుట్టి.. కోలిండియాకు విస్తరణ

శ్రీరాంపూర్‌: సింగరేణి కార్మికులకు ఏటా దీపావళికి అందిస్తున్న పీఎల్‌ఆర్‌ బోనస్‌ రూ.1,10,250కు చేరుకుంది. 1962లో రూ.300తో మొదలైన బోనస్‌ 2026లో రూ.1,10,250కు చేరుకుంది. దేశ వ్యాప్తంగా బొగ్గు గని కార్మికులకు ప్రతి సంవత్సరం చెల్లించే ప్రాఫిట్‌ లింక్డ్‌ రివార్డు (పీఎల్‌ఆర్‌)కు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1962లో ఈ హక్కు మొదలైంది. సింగరేణిలో పుట్టిన ఈ హక్కు చివరికి కోలిండియా వ్యాప్తంగా అమలవుతోంది. శనివారం కోల్‌కత్తాలో జరిగిన జేబీసీసీఐ అపెక్స్‌ కమిటీ సమావేశంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి గానూ పీఎల్‌ఆర్‌ బోనస్‌ రూ.1,10,250 చెల్లించడానికి నిర్ణయం జరిగింది. దీంతో దేశ వ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో విస్తరించిన కోలిండియా పరిధిలోని 8 సబ్సిడరీ కంపెనీలతో పాటు సింగరేణి కార్మికులకు కూడా ఈ బోనస్‌ చెల్లిస్తారు. దీంతో దేశ వ్యాప్తంగా సుమారు 2.25 లక్షల మంది కార్మికులకు ఈ ప్రయోజనం చేకూరనుంది. కమ్యూనిస్టు నాయకుడు, నాటి ఖమ్మం ఎంపీ, దివంగత టీబీ విఠల్‌రావు రష్యా పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ బొగ్గు సంస్థల్లో లాభాల ఆధారంగా బోనస్‌ చెల్లిస్తున్న విషయం తెలుసుకున్నారు. సింగరేణిలో కూడా బోనస్‌ చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ మరో కమ్యూనిస్టు నాయకుడు కొమురయ్యతో కలిసి సమ్మె చేశారు. సమ్మెతో దిగి వచ్చిన సింగరేణి యాజమాన్యం కార్మికులకు ఈ హక్కును కల్పించింది. మొదటగా రూ.3 వేలు చెల్లించారు. ఆ తర్వాత కోలిండియాలో కూడా దీనిపై డిమాండ్‌ పెరగడంతో 1965లో ఈ బోనస్‌ చెల్లింపుపై పార్లమెంట్‌లో చట్టం చేయడంతో అప్పటి నుంచి బొగ్గుగనుల్లో అమలవుతోంది.

దీపావళి బోనస్‌గా పేరు

పశ్చిమబెంగాల్‌లో కోలిండి యా ప్రధాన కేంద్ర కార్యాలయం ఉంది. అక్కడ దసరా పెద్ద పండగగా జరుపుకుంటారు. దసరాకు ముందు జాతీయ సంఘాలతో కోలిండియా యాజ మాన్యం చర్చలు జరిపి దీనిపై నిర్ణయానికి వస్తారు. ఈ బోనస్‌ను కోలిండియాలో దసరాకు ముందు చెల్లిస్తే సింగరేణిలో దీపావళికి ముందు చెల్లిస్తారు. దీంతో దీపావళి బోనస్‌ అని కూడా పిలుస్తారు. ఈసారి రూ.1.20 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేయగా చివరికి రూ.1,10,250కు ఒప్పందం జరిగింది.

కొన్నేళ్లుగా పీఎల్‌ఆర్‌ బోనస్‌ చెల్లింపులు ఇలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement