హక్కుల సాధనకు ఉద్యమించాలి | - | Sakshi
Sakshi News home page

హక్కుల సాధనకు ఉద్యమించాలి

Oct 5 2026 1:33 AM | Updated on Oct 5 2026 1:33 AM

దండేపల్లి: హక్కుల సాధనకు ఉద్యమకారులు ఐక్యతగా ఉండి ఉద్యమించాలని తెలంగాణ ఉద్యమకారుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు తొడేటి శంకర్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శి చిలుక శంకర్‌ పిలుపునిచ్చారు. దండేపల్లి జీపీ కార్యాలయ ఆవరణలో మండలంలోని తెలంగాణ ఉద్యకారులతో ఆదివారం సమావేశమయ్యారు. ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. నిజమైన ఉద్యమకారులకు గు ర్తింపు కార్డులు అందించాలన్నారు. ఉద్యమ కారుల కు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. హామీ లు అమలు చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు రామిడికుమార్‌, రాష్ట్ర కార్యదర్శి గోపతి రాజయ్య, మండల మాజీ అధ్యక్షుడు రాజమల్లు, జేఏసీ అధ్యక్షుడు శంకర్‌గౌడ్‌, సమితి నాయకులు సురేందర్‌, రవీందర్‌, వెంకటేశ్వర్లు, గంగయ్య, రాజన్న, వెంకటేష్‌, సత్యం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement