శ్రీరాంపూర్: అంగన్‌వాడీలు, ఆశ వర్కర్ల సేవలు అమూల్యమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు, ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ ఆధ్వర్యంలో ‘సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం శ్రీరాంపూర్ జోన్‌లో మహిళా మోర్చా ఆధ్వర్యంలో అంగన్‌వాడీ, ఆశ వర్కర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సేవా సంకల్ప్ అభియాన్ జిల్లా కన్వీనర్ వెంకటకృష్ణ, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు కమలాకర్‌రావు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పచ్చ స్వప్న, రేణుక, శిరీష, స్వరూప రాణి, సత్రం రమేశ్, పొన్నవేని సదయ్య, భద్రి శ్రీకాంత్, నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.


