మెరుగుపడలే.. | - | Sakshi
Sakshi News home page

మెరుగుపడలే..

Oct 4 2026 8:44 AM | Updated on Oct 4 2026 8:44 AM

‘సమగ్ర శిక్ష’ ర్యాంకుల విడుదల రాష్ట్రంలోనే అట్టడుగున కుమురంభీం ఆదిలాబాద్‌కు 30వ ర్యాంక్‌ ఫర్వాలేదనిపించిన నిర్మల్‌, మంచిర్యాల

ఆదిలాబాద్‌టౌన్‌: తెలంగాణ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల పనితీరుకు సంబంధించి ప్రగతి నివేదికను ప్రభుత్వం విడుదల చేసింది. విద్యా ప్రమాణాలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు , పాఠశాలల పనితీరు, అభ్యాసన సామర్థ్యాలు ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. ఒక్కో అంఽశానికి పది మార్కులను కేటాయించగా మొత్తం 210 మార్కులకు గాను ఈ ర్యాంకులను విడుదల చేశారు. ఇందులో జనగామ జిల్లా 151.29 స్కోర్‌తో ప్రథమస్థానంలో నిలువగా అట్టడుగు స్థానంలో కుమురంభీం ఆసిఫాబాద్‌ 79.62 స్కోర్‌ను సాధించింది. అయితే ఆదిలాబాద్‌ జిల్లా 88.69 స్కోర్‌తో 30వ స్థానంలో నిలిచింది.

ఆదిలాబాద్‌ జిల్లా విద్యాశాఖ పనితీరు..

ఆధార్‌ స్కోర్‌లో పదిమార్కులకు గాను 2.65, పీఎం శ్రీ నిధుల వినియోగానికి సంబంధించి 1.71, ఎస్‌ఎస్‌ఏకు సంబంఽధించి 8.95, విద్యార్థుల హాజరులో 5.41, టీచర్ల హాజరులో జీరో, మధ్యాహ్న భోజనానికి సంబంధించి 7.24 , పీజీఐ, పరివర్తనలో జీరో, డీఈవో పాఠశాలల సందర్శనలో 1.61 , ఎంఈఓల పర్యవేక్షణ 1.5, సెక్టోరల్‌ అధికారుల పర్యవేక్షణ 2.1, బేస్‌లైన్‌ 4.58, మరుగుదొడ్లకు సంబంఽధించి 3.6, తాగునీటికి సంబంధించి 7.95 మార్కులు రావడం విద్యాశాఖ పనితీరుకు అద్దం పడుతోంది. గతంలో కేంద్రప్రభుత్వం విడుదల చేసిన ర్యాంకులో జిల్లా చివరి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. మండల విద్యాఽధికారుల పర్యవేక్షణ, ఉపాధ్యాయుల పనితీరుతో విద్యాశాఖ అట్టడుగుస్థానంలో నిలుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికి పనితీరులో మాత్రం ఆశించిన స్థాయిలో మార్పురావడం లేదనేదీ స్పష్టమవుతోంది.

ఉమ్మడి జిల్లాలో..

ఉమ్మడి జిల్లా చూస్తే నిర్మల్‌ 17వ ర్యాంక్‌ సాఽ దించింది. 210 మార్కులకు గాను 105.37 మార్కులు వచ్చాయి. ఆదిలాబాద్‌ కంటే మెరుగైన స్థానంలో ఉంది. మంచిర్యాల 18వ స్థానంలో నిలవగా, 104.38 మార్కులు వచ్చాయి. కు మురంభీం జిల్లా రాష్ట్రస్థాయిలో చివరి స్థానంలో నిలిచింది. 33వ స్థానానికి పడిపోయింది. 79.62 మార్కులు మాత్రమే వచ్చాయి.

ఆదిలాబాద్‌ జిల్లా విద్యాశాఖ కార్యాలయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement