దండేపల్లి: గతంలో పాఠశాల విద్యార్థుల జవా బు పత్రాలను సంబంధిత ఉపాధ్యాయులే దిద్దేవారు. కానీ విద్యావ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఏ–1 మూల్యాంకనంలో మార్పులు చేపట్టింది. ఒక పాఠశాల 9వ తరగతి విద్యార్థుల ఎస్‌ఏ–1 జవాబు పత్రాలను మరో పాఠశాల ఉపాధ్యాయులు దిద్దాలని ఆదేశించింది. ఇందులో భాగంగా మండలంలోని 9 ఉన్నత పాఠశాలలు, కేజీబీవీ, మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రశ్నపత్రాల మూల్యాంకన ప్రక్రియను దండేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం ప్రారంభించారు. ఎంఈవో మంత్రి రాజు పరిశీలించి పలు సూచనలు చేశారు. కోర్సు ఇన్‌చార్జి సంగర్స్ రాజేశ్వర్‌రావు, స్ట్రాంగ్ టీచర్ అప్పాల మనోహర్, సీఆర్పీ గరిగే నర్సయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


