జైపూర్: జైపూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళా శాలలో జాతీయ వన్యప్రాణి వారోత్సవాలను అటవీ అధికారుల ఆధ్వర్యంలో శనివారం ఘన ంగా నిర్వహించారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ జి.సుధాకర్ మాట్లాడుతూ.. అడవులు, వన్యప్రాణులను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. అడవులు, వన్యప్రాణుల ప్రాధాన్యత, వాటి పరిరక్షణపై అటవీ అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డి.రాజ్యలక్ష్మి, కౌన్సిలర్ మెంబర్ బండి ప్రసాద్, అటవీ అధి కారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


