పెండింగ్‌ దరఖాస్తులు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ దరఖాస్తులు పరిష్కరించాలి

Oct 4 2026 8:32 AM | Updated on Oct 4 2026 8:32 AM

మంచిర్యాలఅగ్రికల్చర్‌: పెండింగ్‌ దరఖాస్తులు అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ వి.రాములు అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారి మోతీరాం, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావుతో కలిసి అన్ని మండలాల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సర్వేయర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రజావాణి ద్వారా వచ్చిన పెండింగ్‌ దరఖాస్తులను మండల, ఆర్డీవో, మున్సిపల్‌ కార్పొరేషన్‌, తదితర స్థాయిలలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. సాదాబైనామా ఆమోదించినవి, తిరస్కరించిన వాటికి గల కారణాలు, అందిన దరఖాస్తుల సంఖ్య, తదితర వివరాలతో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలన్నారు. 22–ఏ సమస్యలపై జిల్లా స్థాయిలో పరిష్కరించిన, పెండింగ్‌లో ఉన్న అంశాలు, ప్రస్తుత స్థితిగతులతో కూడిన నివేదికను సిద్ధం చేయాలని సూచించారు.

సరుకులు సకాలంలో పంపిణీ చేయాలి

మంచిర్యాలఅగ్రికల్చర్‌: ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి సరుకులు సక్రమంగా పంపిణీ చేయాలని అదనపు కలెక్టర్‌ వి.రాములు అన్నారు. శనివారం పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ శ్రీకళ, డిప్యూటీ తహసీల్దార్‌లతో కలిసి ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల ఇన్‌చార్జీలు, డిప్యూటీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరమైన మేరకు సరుకులను సకాలంలో లిఫ్ట్‌ చేసుకోవాలని, నిర్ణీత సమయంలో పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement