మంచిర్యాలక్రైం: వివిధ సమస్యలతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చేవారు దళారులను ఆశ్రయించకుండా నేరుగా అధికారులను కలవాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. కమిషనరేట్ సమావేశ హాలులో ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రతీ ఫిర్యాదును నమోదు చేసి, పారదర్శకంగా విచారణ చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చట్ట పరిధిలో బాధితులకు న్యాయం చే యడం పోలీసు శాఖ బాధ్యత అన్నారు.


