సీఎంఆర్ ఎగవేత దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ చంద్రయ్యకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి లాల్‌కుమార్ మాట్లాడుతూ 2022–25 వరకు జిల్లాలోని రైస్ మిల్లర్లు రూ.200 కోట్లు ఎగవేశారని ఆరోపించారు. బాధ్యులపై పీడీయాక్టు నమోదు చేసి ఆస్తులను జప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్, డి.బ్రహ్మనందం, నాయకులు మేకల రాములు, తిరుపతిరెడ్డి, ప్రభాకర్, శ్రీకాంత్, చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.


