మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణిలో వచ్చిన అర్జీలు పెండింగ్‌లో ఉంచకుండా పూర్తిస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రయ్య, రాములు, డీఆర్వో మోతీరాం, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీతో కలిసి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా భూ సమస్యలు, పెన్షన్, తదితర సమస్యలపై 70 ఫిర్యాదులు అందినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
పింఛన్ మంజూరు చేయాలి
నాకు గతంలో దివ్యాంగ పింఛన్ వచ్చేది. 2019లో నిలిపి వేశారు. పింఛన్ మంజూరు చేయాలని పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటి వరకు రాకపోవడంతో ఇబ్బందిగా ఉంది. అధికారులు ఇప్పటికై నా పింఛన్ అందించి ఆదుకోవాలి.
– గుర్రాల రాజవ్వ, వెంకట్రావ్‌పేట్, లక్సెట్టిపేట


