జైపూర్: జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు విస్తరణలో భాగంగా చేపట్టిన మూడో యూనిట్ 800మెగావాట్ల పవర్ ప్లాంటు పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సింగరేణి డైరెక్టర్(ఈఅండ్‌ఎం) ఎం.తిరుమలరావు ఆదేశించారు. సోమవారం పవర్ ప్లాంటును సందర్శించిన ఆయన మూడో యూనిట్ నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా బాయిలర్, ట్రాక్‌హాపర్‌తోపాటు నిర్మాణ దశలో ఉన్న పనులు పరిశీలించి పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అడ్మిన్ భవన కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్టీపీపీ ఈడీ సీహెచ్.చిరంజివి, జీఎంలు నర్సింహారావు, మదన్‌మోహన్, సీఎంవోఏఐ బ్రాంచ్ అధ్యక్షుడు పంతులా, ఏజీఎం సూర్యనారాయణరాజు, కొత్త ప్లాంటు కోఆర్డినేటర్ వేణుగోపాల్‌రావు, పర్సనల్ మేనేజర్ రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.


