మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని కేకే–ఓసీని సింగరేణి డైరెక్టర్(పీపీ) వెంకటేశ్వర్లు సోమవారం సందర్శించారు. ఏరియాలోని ఓసీల్లో బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకతపై ఏరియా జీఎం రాధాకృష్ణను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ త్రైమాసిక బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు ఉత్పత్తి వేగాన్ని పెంచాలని అధికారులకు సూచించారు. అనంతరం కేకే–ఓసీ సమీపంలో స్టౌవింగ్, సైడింగ్ పనులను తనిఖీ చేశారు. ఎస్వో టు జీఎం లలితేంద్రప్రసాద్, ఏజీఎం(ఈఅండ్‌ఎం) బాలాజీ భగవతీ ఝా, డీజీఎం(సర్వే) బుక్య దేశాయి, డీజీఎం(సివిల్)మదీనా బాష, క్వాలిటీ ఆఫీసర్ ప్రదీప్ పాల్గొన్నారు.


