అప్పుడు ఆబ్సెంట్‌.. విచారణలో ప్రజెంట్‌ | - | Sakshi
Sakshi News home page

అప్పుడు ఆబ్సెంట్‌.. విచారణలో ప్రజెంట్‌

Jul 27 2026 11:49 PM | Updated on Jul 27 2026 11:49 PM

● ‘పది’లో ఉత్తీర్ణత సాధించిన అంజమ్మ

దండేపల్లి: మండల కేంద్రానికి చెందిన సిద్ది అంజమ్మ 2025–26 విద్యాసంవత్సరంలో దండేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివింది. మార్చిలో నిర్వహించిన వార్షిక పరీక్షల్లో గణితం, సామాన్యశాస్త్రం పరీక్షలు ఫెయిలైంది. హెచ్‌ఎం రాజేశ్వర్‌రావు ప్రత్యేక చొరవతో సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించారు. జూన్‌లో మంచిర్యాలలోని బాలికల ఉన్నత పాఠశాలలో పరీక్షలు రాసింది. ఫలితాల్లో మాత్రం గణితం పరీక్షకు గైర్హాజరైనట్లు చూపింది. పరీక్ష రాసినా రాయనట్టు చూపడంతో న్యాయం చేయాలని అంజమ్మ తన తల్లి మల్లీశ్వరితోపాటు విద్యార్థిసంఘాల నాయకులు జిల్లా కలెక్టర్‌, డీఈవో, రామగుండం సీపీకి ఫిర్యాదు చేశారు. ఆమె పరీక్షకు హాజరు కాలేదని అప్పట్లో డీఈవో ప్రకటించారు. అంజమ్మ హైదరాబాద్‌లోని ఎసెస్సీ బోర్డు కార్యాలయానికి వెళ్లి తన గోడు వెల్లబోసుకుంది. విచారణ చేయగా ఆమెకు కేటాయించిన గదిలో కాకుండా మరో గదిలో కూర్చుని పరీక్ష రాసినట్లు తేలింది. ఫలితాలను పరిశీలించగా ఉత్తీర్ణత సాధించినట్లు తేల్చారు. ఈ విషయమై జిల్లా ఏసీజీఈ మల్లేష్‌ను సంప్రదించగా, అంజమ్మకు కేటాయించిన గదిలో కాకుండా మరో గదిలో కూర్చోవడంతో హాజరు నమోదు కాకపోవడంతో ఫలితం తారుమారైందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement