ఆరోగ్య కార్యక్రమాలపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్య కార్యక్రమాలపై దృష్టి సారించాలి

Jul 27 2026 11:49 PM | Updated on Jul 27 2026 11:49 PM

మంచిర్యాలటౌన్‌: జిల్లాలోని వైద్యులు, సిబ్బంది జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై దృష్టి సారించాలని, సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండి ప్రజలకు సరైన వైద్యం అందించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ నరేందర్‌రాథోడ్‌ అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో సోమవారం జిల్లాలోని వైద్యాధికారులతో వైద్య, ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, మాతాశిశు సంరక్షణ వందశాతం నమోదు, గర్భిణులకు పరీక్షలు, హైరిస్క్‌ గర్భిణులను గుర్తించి సకాలంలో వైద్యం అందించాలని తెలిపారు. జాతీయ క్షయవ్యాధి నియంత్రణలో భాగంగా వ్యాధిగ్రస్తులను గుర్తించడం, పోర్టబుల్‌ ఎక్స్‌రే ద్వారా మారుమూల ప్రాంతాల్లోనూ పరీక్షలు నిర్వహించాలని అన్నారు. మానసిక ఆరోగ్యంపై పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్‌ సుధాకర్‌నాయక్‌, ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ అరుణశ్రీ, మాస్‌ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్‌, సీహెచ్‌వో కాకిరాల వెంకటేశ్వర్లు, డీడీఎం ప్రవళిక పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement