విద్యార్థుల అభ్యసన స్థాయిని మెరుగుపర్చాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల అభ్యసన స్థాయిని మెరుగుపర్చాలి

Jul 27 2026 11:49 PM | Updated on Jul 27 2026 11:49 PM

మంచిర్యాలఅర్బన్‌: విద్యార్థుల అభ్యసన స్థాయిని మెరుగుపర్చేందుకు వినూత్న బోధన పద్ధతులు, ప్రాథమిక అక్షరాస్యత సంఖ్యాజ్ఞానం, కార్యాచరణ ఆధారిత బోధన అంశాలపై ప్రత్యేక దృషి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య సూచించారు. స్థానిక జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం ఎఫ్‌ఎల్‌ఎన్‌ ఫౌండేషన్‌ పాఠశాలల ఉపాధ్యాయులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు శిక్షణను 2026–27 విద్యాసంవత్సరంలో సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. పీజీఐ సూచికల్లో జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రతీ ఉపాధ్యాయుడు కృషి చేయాలన్నారు. హాజీపూర్‌ ఎంఈవో తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏఎంఓ జంబోజు సత్తయ్య, హాజీపూర్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయురాలు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement