ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల్లో మాతాశిశు మరణాలను నియంత్రించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సంకల్ప్ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు కింద జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిని ఎంపిక చేశారు. ఇందులో భాగంగా ఆసుపత్రిలోని వసతులు, మెరుగైన వసతుల కల్పనకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై మంగళవారం హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర సెక్రెటరీ క్రిస్టినా జడ్ చోంగ్తు ముఖ్య అతిథిగా హాజరైన సమావేశంలో రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్, డీసీహెచ్‌ఎస్ డా.ఉపేందర్ జాదవ్, రిమ్స్ పిడియాట్రిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.వంశీకృష్ణ, నర్సింగ్ సిబ్బంది అరుణ, సిమ్మి కుమారి, తదితరులు పాల్గొన్నారు.


