కెరమెరి: మండలంలోని కొఠారి గ్రామానికి చెందిన డీఆర్ డిపో సేల్స్‌మెన్ చహకటి రాజేశ్వర్ తెల్లవారుజామున తన కుమారుడు జగదీశ్వర్‌ను బైక్‌పై ఎక్కించుకుని ఆసిఫాబాద్‌కు బయలుదేరాడు. మానిక్‌గూడ సమీపంలో వాహనానికి పందులు అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి కిందపడింది. జగదీశ్వర్‌కు స్వల్పంగా రాజేశ్వర్‌కు తీవ్రగాయాలయ్యాయి. 108లో ముందుగా ఆసిఫాబాద్ అక్కడి నుంచి మంచిర్యాలకు తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. జగదీశ్వర్ మంచిర్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.


