సీఎంను కలిసిన ఎమ్మెల్యే బొజ్జు | - | Sakshi
Sakshi News home page

సీఎంను కలిసిన ఎమ్మెల్యే బొజ్జు

Jun 16 2026 11:46 PM | Updated on Jun 16 2026 11:46 PM

ఉట్నూర్‌రూరల్‌: ఖానాపూర్‌ ఎమ్మెల్యే, నిర్మల్‌ డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు మంగళవారం త న జన్మదినాన్ని పురస్కరించుకుని ముఖ్య మంత్రి రేవంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశా రు. పుష్పగుచ్చం అందించి సీఎం ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే బొజ్జుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఆయనకు ఆయురా రోగ్యాలు ప్రసాదించాలని, నిరంతరం ప్రజా సేవలో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి మ రింత కృషి చేసి భవిష్యత్‌లో మరెన్నో విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు.

దాడి కేసులో ఆరుగురు యువకుల రిమాండ్‌

కాసిపేట: మండలంలోని సోమగూడెం(కె)లో గత నెలలో జరిగిన దాడి కేసులో ఆరుగురు యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించా రు. మండలంలోని ధర్మరావుపేటకు చెందిన ముచ్చర్ల సంపత్‌, అతని స్నేహితులు మందమర్రి టోల్‌గేట్‌ సమీపంలోని గోపాల్‌ దాబా వ ద్దకు వెళ్లగా అక్కడ కొంతమంది వ్యక్తులతో పా ర్సిల్‌ విషయమై వాగ్వివాదం జరిగింది. అక్కడి నుంచి వచ్చి సోమగూడెంలోని బంధువుల ఇంటివద్ద ఉండగా దాబా వద్ద ఉన్న వ్యక్తులు ఆయుధాలతో అక్కడికి వచ్చి వారిపై దాడికి పాల్పడడంతో సంపత్‌, అల్లంల ప్రశాంత్‌, బొ మ్మనవేణి వరప్రసాద్‌, ఆకుల రాణాప్రతాప్‌కు గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు దనకుంట్ల మునియప్ప, మహమ్మద్‌ అబ్బు, మహమ్మద్‌ సమీరుద్దీన్‌, అఖిల్‌, మల్యాల చందు, షేక్‌ ఫేరోజ్‌ను అరెస్టు చేశారు. నిందితుల ను కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల జ్యూడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో ఆసిఫాబాద్‌ జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

గుప్తనిధులకోసం తవ్వకాలు

కాగజ్‌నగర్‌రూరల్‌: మండలంలోని ఈజ్‌గాం శివారులోని పంటచేలలో గుప్త నిధుల కోసం చేపట్టిన తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. వారం రోజుల క్రితం శివారులోని పంట చేనులో పొక్లెయిన్‌తో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చెట్టు సమీపంలో తవ్వి పూడ్చిపెట్టారని ప్రచారం జరుగుతోంది. ముఠాను పట్టుకుని చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

స్పెషల్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌గా రమేశ్‌

మంచిర్యాల క్రైం: మంచిర్యాల జిల్లా స్పెషల్‌ జ్యుడీషియల్‌ సెకండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌గా పట్టణానికి చెందిన సమిట్ల రమేశ్‌ను నియమిస్తూ తెలంగాణ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం ఏడాదిపాటు ఉంటుందని రమేశ్‌ తెలిపారు. కాగా రమేశ్‌ 20 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో ఉన్నారు. స్థానిక న్యాయవాదులు, బార్‌కౌన్సిల్‌ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement