తలమడుగు: చేపలు పట్టడానికి వెళ్లి విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. కొత్తూరుకు చెందిన కాటిపల్లి కపిల్‌రెడ్డి (31)మంగళవారం అతని స్నేహితులు శైలేందర్, రామయ్య, ప్రమోద్, గంగయ్యతో కలిసి చేపలు పట్టేందుకు సమీపంలోని వాగుకు వెళ్లారు. విద్యుత్ తీగల సహాయంతో చేపలు పట్టే ప్రయత్నంలో కపిల్‌రెడ్డి షాక్‌కు గురయ్యాడు. చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని భార్య మానస ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాధిక తెలిపారు.
అనుమానాస్పదంగా ఒకరు..
తానూరు: అనుమానాస్పదంగా ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై షేక్ జుబేర్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని బోల్సాలో పాలేరుగా పనిచేస్తున్న కందురోళ్ల పీరాజీ (35) సోమవారం రాత్రి యజమాని పశువుల పాకకు వెళ్లి అక్కడే పడుకున్నాడు. మంగళవారం ఉదయం అటుగా వెళ్లిన తోటి పాలేర్లకు చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించడంతో ఏఎస్పీ సాయికిరణ్, సీఐ రవీందర్ నాయక్, ఎస్సై ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా చాకు, మృతదేహాంపై చింపేసినట్లు ఉన్న చొక్కా, కల్లు సీసాలు, మద్యం బాటిళ్లు గుర్తించారు. భూ వివాదం విషయమై పాత కక్షలతో సమీప బంధువులే హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ బెల్‌తరోడా–భైంసా రహదారిపై ధర్నా నిర్వహించారు. మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు..
దిలావర్‌పూర్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలైన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మంజులాపూర్‌కు చెందిన ఉప్పల గణేశ్ (57)కు దిలావర్‌పూర్‌లోని పాత బస్టాండ్ ప్రాంతంలో వ్యవసాయ భూమి ఉంది. దానిని ము జ్టిగ ముత్యంకు కౌలుకు ఇచ్చాడు. మంగళవారం పంటచేను చూసేందుకు వచ్చాడు. ముత్యంను బస్టాండ్ వరకు రమ్మని పిలవడంతో అతని ఎలక్ట్రిక్ వాహనంపై వెళ్తుండగా నిర్మల్–భైంసా రహదారిపై వెనుకనుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. గణేశ్ అక్కడికక్కడే మృతి చెందగా ముత్యంకు గాయాలు కావడంతో నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు.
యువతి అదృశ్యం
సిర్పూర్(టి): మండలంలోని చీలపెల్లికి చెందిన నిఖిత ఈ నెల 15న రాత్రి ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదని, కుటుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాగర్ తెలిపారు. గ్రామానికి చెందిన యు.సునీత కుమార్తె నిఖిత 15న రాత్రి బహిర్భూమికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి తిరిగిరాలేదన్నారు. గతంలో ఆసిఫాబాద్ మండలం నవేగాంకు చెందిన రెగర్ల వెంకటేష్ నిఖితను తీసుకెళ్లి సిర్పూర్(టి)లో వది లేసి వెళ్లిపోయాడన్నారు. ఇప్పుడు కూడా తమ కూ తుర్ని అతనే తీసుకెళ్లినట్లు బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సునీత ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


