బొగ్గు బాయిలపై వివిధ పార్టీల నజర్ పోటాపోటీగా కార్యక్రమాల నిర్వహణ కార్మికుల మద్దతు కోసం ప్రయత్నం అధికార, ప్రతిపక్షాల మాటల యుద్ధం సింగరేణిలో పెరిగిన పొలిటికల్ హీట్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: బొగ్గు గనులపై రాజకీ యం వేడెక్కింది. జిల్లాలో కొద్ది రోజులుగా బొగ్గు గ నులు కేంద్రంగా కార్మిక వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు పోటాపోటీగా కా ర్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. రాజకీయ ప్రముఖు లు పర్యటిస్తున్న క్రమంలో నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో మాటల యుద్ధం పెరుగుతోంది. రెండురోజులుగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురా లు కల్వకుంట్ల కవిత ‘బాయి బాట’ పేరిట గనుల ను సందర్శిస్తున్నారు. కాసిపేట, శ్రీరాంపూర్‌తో పా టు స్థానిక కార్మికులను కలుస్తూ పలు సమస్యలు తె లుసుకుంటున్నారు. కార్మికుల వసతుల నుంచి సంస్థ విధానాలపై తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. కవి త హెచ్‌ఎంఎస్‌కు గౌరవాధ్యక్షురాలిగా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ‘బాయి బాట’తో కార్మి క లోకానికి దగ్గరయ్యేందుకు యత్నిస్తున్నారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ తోపాటు బీఆర్‌ఎస్‌పైనా విమర్శలు గుప్పిస్తున్నా రు. గతంలో కవిత టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా పనిచేయగా, తాజాగా కొత్త రాజకీయ పార్టీతో ఇక్క డి నుంచే రాజకీయాలు చేస్తామని ప్రకటించారు.
డిప్యూటీ సీఎం, మంత్రుల టూర్
ఇటీవలే జిల్లాకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమా ర్కతో పాటు మంత్రులు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొ న్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో, సింగరే ణి ప్రాంత ఎమ్మెల్యేలు పర్యటించారు. కొంతకా లంగా పెండింగ్‌లో ఉన్న సింగరేణి కార్మికుల వారసులకు సంస్థలో కారుణ్య నియామకాలు ఇచ్చారు. ఒకేరోజు జిల్లా కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసి 335మందికి నియామక పత్రాలు ఇచ్చారు. డిప్యూ టీ సీఎం, మంత్రి శ్రీధర్‌బాబు, స్థానిక ఎమ్మెల్యే ప్రే మ్‌సాగర్‌రావు నివాసంలోనే బస చేశారు. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్టుపై ఓపెన్ హౌస్ నిర్వహించారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలపై బొగ్గు వెలికితీత నుంచి ఉత్పత్తి, రవాణా వరకు మీడియా సమక్షంలోనే అధికారులతో వివరించారు.
రాజకీయ జోక్యం.. కార్మికుల బేజారు
స్వతంత్ర ప్రతిపత్తిగల సింగరేణి కంపెనీలో మితి
మీరిన రాజకీయ జోక్యం ఇప్పటికే సంస్థ పని తీరు పై ప్రతికూల ప్రభావం చూపుతోందనే విమర్శలు న్నాయి. కంపెనీలో కార్మికుడికి క్వార్టర్ కేటాయింపు నుంచి డిప్యుటేషన్, బదిలీ లాంటి చిన్న పనుల నుంచి మెడికల్‌బోర్డు ఏర్పాటు, నూతన నియామకాలు, టెండర్లు, సంస్థ లావాదేవీల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజకీయాలు ప్రభావితం చేయడంతో కార్మిక వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇక గత, ప్రస్తుత ప్రభుత్వాలు సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలు విద్యుత్ సంస్థ నుంచే కాకుండా సర్కా రు నుంచి వచ్చే మొత్తాన్ని సకాలంలో చెల్లించకపోవడంతోనూ సంస్థ పరిస్థితి రోజురోజుకూ ఇబ్బంది గా మారింది. ఓ వైపు బొగ్గుకు తగ్గుతున్న డిమాండ్, భూ గర్భగనుల్లో నష్టాలు, ఓపెన్‌కాస్టుల్లో ప్రైవేట్ కాంట్రాక్టర్ల తీరుతో సంస్థకు ఇటీవల ఆశించిన తీరులో లాభాలు రావడం లేదు. ఇటీవల జిల్లా పర్యటనలో డిప్యూటీ సీఎం కూడా సింగరేణిలో రాజకీ య జోక్యం ఉండబోదని ప్రకటించారు. స్వయం ప్ర తిపత్తి సంస్థ హోదాను కాపాడుతామని హామీ ఇ చ్చారు. అయితే, ఇప్పటికే కంపెనీలో కార్మికులకు మేలు చేస్తున్నామనే పేరుతో అన్ని రాజకీయ పార్టీ లు సంస్థను ప్రభావితం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఏ మేరకు సంస్థ తన స్వతంత్రను నిలబెట్టుకుంటుందనేది కార్మిక వర్గాల్లో పెద్దప్రశ్నగా మిగిలింది.
సంస్థలో 40లక్షల టన్నుల బొగ్గు నిల్వలు మా యమయ్యాయని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపణలు చేశారు. దీంతో కంపెనీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే దీనిపై సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. ఇక జైపూర్ థర్మల్‌ప్లాంట్‌లో 800 మెగావాట్ల యూనిట్ పనుల్లో అవినీతి జరిగిందని విమర్శించారు. ఈ రెండింటిపై కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాయగా, ఆయన స్పందించారు. దీంతో జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు అధికార పార్టీకి చెందిన కోల్ బెల్ట్ పరిధి మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ ఆరోపణల్ని తిప్పి కొట్టే ప్రయత్నాలు చేశారు. అంతేకాకుండా ఇటీవల టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంచిర్యాలకు వచ్చి మాజీ ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, చిన్నయ్య, కార్మిక నాయకుడు రాజిరెడ్డి, ఇతర నాయకులతో కలిసి ప్రెస్‌మీ ట్ నిర్వహించి బీజేపీ, కాంగ్రెస్ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించకుండా జాప్యం చేస్తున్నారని, కార్మికులకు నష్టం చేస్తున్నారని ఆరోపించారు.


