భీమిని: ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి డీఈవో చంద్రయ్య సూచించా రు. మంగళవారం మండల కేంద్రంలోని కేజీ బీవీ, జిల్లా పరిషత్ పాఠశాలలను సందర్శించారు. కేజీబీవీలో చేపట్టిన భోజ నశాల పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలో ఆర్వో ప్లాంట్‌కు మరమ్మతు చేయించాలని సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని తెలిపారు. అనంతరం జిల్లా పరిష త్ పాఠశాలలో బూత్ స్థాయి అధికారులు, ఏ జెంట్లకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై నిర్వహిస్తున్న శిక్షణకు హాజరై పలు సూచనలు చేశారు. భారత ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ ఎలాంటి పొరపాట్లు లేని స్పష్టమైన ఓటరు జాబితా రూపకల్పన దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా పరిషత్ పాఠశాలకు మంజూరైన మూత్రశాలలు త్వరగా నిర్మించాలని ఆదేశించారు. ఎంపీడీవో గంగమోహన్, తహసీల్దార్ బికర్ణదాస్, ఎంఈవో వెంకటస్వామి, ఎంపీవో మహేశ్, సర్పంచ్ శ్రీకాంత్‌గౌడ్ తదితరులున్నారు.


