చెన్నూర్: చెన్నూర్ కోర్టు పరిధిలోని పెండింగ్ కేసుల పరిష్కారానికి న్యాయవాదులు కృషి చేయాలని చెన్నూర్ మున్సిఫ్ కోర్టు సివిల్ జడ్జి రవి సూచించారు. స్థానిక కోర్టు సమావేశ మందిరంలో ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో పెండింగ్ కేసుల ప రిష్కారమే లక్ష్యంగా న్యాయవాదులతో ఏర్పా టు చేసిన సమావేశంలో జడ్జి మాట్లాడారు. కక్షిదారులు రాజీపడేలా న్యాయవాదులు చొర వ చూపాలని సూచించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొలిపాక రవీందర్, సీనియర్ న్యాయవాదులు రమేశ్‌చందర్‌గిల్డా, మల్లేశంగౌడ్, న్యాయవాదులు కాయిత మహేశ్, మద్ది కార్తిక్, సంజీవ్, రమేశ్ పాల్గొన్నారు.


