సింగరేణిలో మానవ హక్కుల ఉల్లంఘన | - | Sakshi
Sakshi News home page

సింగరేణిలో మానవ హక్కుల ఉల్లంఘన

Jun 16 2026 11:46 PM | Updated on Jun 16 2026 11:46 PM

● మెడికల్‌ బోర్డును పునరుద్ధరించాలి ● టీఆర్‌ఎస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

శ్రీరాంపూర్‌: సింగరేణిలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆమె ఆర్కే 7గని, ఏరియా స్టోర్స్‌లను సందర్శించారు. హెచ్‌ఎమ్మెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్‌ అ హ్మద్‌తో కలిసి కార్మికుల సమస్యలు తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూగర్భ గనుల్లో కార్మికులకు గాలి అందక ఇబ్బంది పడుతున్నారని, తాగునీరు కూడా దొరకడం లేదని అన్నా రు. కంపెనీలోని కార్మికుల పిల్లల చదువుల కోసం సీబీఎస్‌ఈ పాఠశాలలు ఏర్పాటు చేయాలని తెలిపా రు. 2 వేల మంది డిపెండెంట్లు ఉంటే కేవలం 335 మందికే భట్టి విక్రమార్క లెటర్లు ఇచ్చారని, మిగతా వారికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి కొత్త గనులు లేవడంలో విఫలమయ్యారని ఆరోపించారు.

అన్నలంతా మా దగ్గరే ఉన్నారు..

గతంలో అన్నలు ఉన్నప్పుడు కంపెనీ అధికారులు భయపడి చక్కగా పని చేసేవారని, ఇప్పుడు వారు లేరనుకుంటున్నారని, కానీ వారంతా టీఆర్‌ఎస్‌లో ఉన్నారని, కార్మికుల హక్కుల ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని కవిత హెచ్చరించారు. గనిలోకి రాకుండా పోలీసులతో అడ్డుకుంటున్నారని, తల్లి కాంగ్రెస్‌తోనే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని, ఈ పిల్ల కాంగ్రెస్‌ మాకో లెక్కా అని మండిపడ్డారు.

గేటు వద్ద ఉద్రిక్తత

ఆర్కే 7, ఏరియా వర్క్‌షాప్‌ వద్ద కవిత కాన్వయ్‌ను గనిలోకి రాకుండా పోలీసులు, సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. గేట్లకు తాళాలు వేయడంలో కార్యకర్తలు పగలగొట్టి దూసుకెళ్లారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీరాంపూర్‌ బ స్టాండ్‌, సీసీసీలో జెండా పండుగ నిర్వహించారు. అనంతరం సీసీసీలోని డంప్‌యార్డును పరిశీలించి దాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధ్యక్షుడు తిప్పారపు సారయ్య, బ్రాంచీ ఉపాధ్యక్షుడు అనిల్‌రెడ్డి, కార్యదర్శి పీ. అశో క్‌, జిల్లా జిల్లా ఇన్‌చార్జీ చంద్రమోహన్‌గౌడ్‌, ఐత ప్ర శాంత్‌, నాయకులు గోసిక అశోక్‌, సుదర్శన్‌, చెవుల శ్రీను, వినయ్‌, వరలక్ష్మీ, సురేశ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement