మంచిర్యాలఅగ్రిల్చర్: వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాద వ్, అదనపు కలెక్టర్ చంద్రయ్య, వివిధ శాఖల అధి కారులు, మున్సిపాలిటీల కమిషనర్లతో వన మహోత్సవంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శాఖలవారీగా కేటాయించి న లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు సమన్వయంతో మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టా లని సూచించారు. ఈ నెల 18న సీఎం రేవంత్‌రెడ్డి వన మహోత్సవాన్ని ప్రారంభిస్తారని, ఇదేరోజు జి ల్లాలో కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏ ర్పాట్లు చేయాలని తెలిపారు. జిల్లాలో 41లక్షల మొ క్కలు నాటి సంరక్షించేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. రహదారుల పక్కన పెద్ద మొక్కలు నాటి జియో ట్యాగింగ్ పూర్తి చేసి రోజువారీగా వివరాలు నవీకరించాలని వివరించారు. మున్సిపాలిటీల పరిధిలో చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని, వాటిని ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు.
అధికారులు అందుబాటులో ఉండాలి
అధికారులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీపీవో వెంకటేశ్వర్‌రావు, జెడ్పీ సీఈ వో గణపతితో కలిసి గ్రామాలాభివృద్ధి ప్రణాళికపై డీఎల్పీవో, ఎంపీవో, జీపీవోలతో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. 16వ ఆర్థిక సంఘం నిబంధనలు, గ్రామపంచాయతీలు, సభ నగర్, నిర్ణయ్ యాప్, ఈ గ్రామ స్వరాజ్ అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. అత్యుత్తమ ర్యాంకింగ్ వచ్చేలా గ్రామపంచాయతీల అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు విధులకు సకా లంలో హాజరు కావాలని, తాగునీటి సరఫరా సక్రమంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. గ్రామసభలు నిర్వహించి గ్రామంలో నెలకొన్న సమస్యలు తెలసుకోవాలని, పన్నులు సకాలంలో వసూలు చేయాలని, అంటువ్యాధులు ప్రబలకుండా, దోమలు వృద్ధి చెందకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సీజీజీ కన్సల్టెంట్ మహేశ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


