మంచిర్యాలరూరల్(హాజీపూర్): యూరియా బుకింగ్ యాప్ వినియోగంపై మంగళవారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట రైతువేదికలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్రమోహన్, వ్య వసాయశాఖ డైరెక్టర్ గోపి వీసీలో పాల్గొనగా జిల్లా నుంచి జిల్లా వ్యవసాయాధికారి సురేఖ, ఏడీఏ మామిడి కృష్ణ, రైతు ఉత్పత్తిదారుల సంఘం డైరెక్ట ర్ పూస్కూరి శ్రీనివాసరావు, సీఏసీఎస్ సీఈవో వినయ్, ఏవో కృష్ణ, ఏఈవో మధుపా, కృషి సఖీ స్వప్న, జాతీయ సహజ వ్యవసాయ రైతులు పాల్గొన్నారు. యూరియా బుకింగ్ యాప్ వినియోగంలో రైతులు ఇంకా చైతన్యం కావాల్సిన అవసరం ఉంద ని, ప్రస్తుతం అందరి సహకారంతో యాప్‌లో యూ రియా బుకింగ్ చేసుకుంటున్నారని, దీంతో సమ యం కూడా ఆదా అవుతోందని మంత్రితో సేంద్రియ రైతులు పూస్కూరి శ్రీనివాసరావు, తిప్పని కుమార్ తెలిపారు. డీలర్ల వద్ద ఎలాంటి వరుస లేకపోవడంతో యూరియా కొనుగోళ్లు సులభతరంగా మారాయని తెలిపారు. అయితే, యాప్‌లో బుకింగ్ పై అవగాహన లేని రైతులకు మీ సేవా కేంద్రం ద్వా రా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించాలని కోరా రు. జీలుగ, జనుము, పచ్చిరొట్టతో యూరియా వి నియోగం చాలా వరకు తగ్గిందని, రైతు ఉత్పత్తిదా రుల సంఘం ద్వారా 125 మంది రైతులు సహజ వ్యవసాయం చేస్తుండగా చాలా వరకు రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లేలా చూస్తున్నామ ని ఉత్పత్తిదారుల సంఘం సభ్యులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన స్పందిస్తూ సేంద్రియ రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు.


