రెండోరోజూ హాజరు అంతంతే.. | - | Sakshi
Sakshi News home page

రెండోరోజూ హాజరు అంతంతే..

Jun 16 2026 11:46 PM | Updated on Jun 16 2026 11:46 PM

● మొదటిరోజు 13శాతం హాజరు ● మంగళవారం 24.5శాతం నమోదు

మంచిర్యాలఅర్బన్‌: సర్కారు పాఠశాలల్లో విద్యార్థు ల హాజరు ఆశించిన స్థాయిలో నమోదు కావడం లే దు. రెండోరోజు మంగళవారం కారణంతో హాజరు అంతంతేగానే ఉంది. కాగా, మొదటిరోజు కంటే కాస్త పెరిగింది. మొదటిరోజు అమావాస్య కావడంతో 13శాతం హాజరు నమోదు కాగా, రెండోరోజు 24.5 శాతానికి పెరిగింది. ఈనెల 15న జిల్లా వ్యా ప్తంగా 34,192 మందికి గాను 4,369 మంది విద్యార్థులు హాజరు కాగా, మంగళవారం 8,184 మంది బడికి వచ్చారు. కొన్నిచోట్ల పాఠశాలలు సమయాని కి డేటాను అప్‌డేట్‌ చేయకపోవటం హాజరు తక్కువగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రైవేట్‌ పా ఠశాలలు కొన్ని తెరుచుకోకపోవటంతో గమన్హారం.

జిల్లాకేంద్రంలో ఇలా..

జిల్లాకేంద్రంలో 21 ప్రైమరీ, ఒక అప్పర్‌ ప్రైమరీ, ఆరు హైస్కూళ్లు, ఒక కేజీబీవీ, ఒక మోడల్‌స్కూల్‌ ఉండగా మొత్తం 3,613 మంది విద్యార్థులు చదువుతున్నారు. బడిబాట ఫలితంగా మొదటిరోజు 49 మంది, మంగళవారం 84మంది విద్యార్థులు నూతనంగా అడ్మిషన్లు పొందారు. దీంతో విద్యార్థుల సంఖ్య 3,697కు చేరింది. పాఠశాలలకు మొదటిరోజు 552 మంది మాత్రమే రాగా, మంగళవారం 732 మంది హాజరయ్యారు. రెండురోజుల వ్యవధిలో విద్యార్థుల సంఖ్య 180 పెరిగింది. ప్రభుత్వం చేపట్టిన ‘బడిబాట’లో భాగంగా చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement