ప్రభుత్వం ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం ఆదుకోవాలి

Jun 3 2026 11:44 PM | Updated on Jun 3 2026 11:44 PM

మందమర్రిరూరల్‌: పట్టణంలోని రామన్‌ కాలనీకి చెందిన రామటెంకి రాధమ్మ, సమ్మయ్య దంపతుల కుమారుడు శ్రీకాంత్‌ ప్రత్యేక రాష్ట్ర సాధనలో నాదే చివరి ఆత్మహత్య కావాలని 2011, ఆగస్టు 6న ఉరేసుకున్నాడు. దీంతో అతని తల్లి పక్షవాతంతో మంచాన పట్టింది. తండ్రి కూడా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఎంతోమంది ప్రజాప్రతినిధులు వారి ఇంటికి వచ్చి అనేక వాగ్దానాలు చేసినప్పటికీ ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని, మందమర్రిలో తమ కుమారుడి విగ్రహం ఏర్పాటు చేయాలని, రామన్‌కాలనీలో సమ్మయ్య సింగరేణి ఉద్యోగం చేసినప్పుడు ఉన్న క్వార్టర్‌ తమకే కేటాయించాలని ఆ దంపతులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement