హోర్డింగ్‌ ఎక్కి.. | - | Sakshi
Sakshi News home page

హోర్డింగ్‌ ఎక్కి..

Jun 3 2026 11:44 PM | Updated on Jun 3 2026 11:44 PM

మంచిర్యాలఅర్బన్‌: తెలంగాణ ఉద్యమాన్ని ఉరుకులు పెట్టించడంలో ముందు వరుసలో నిలిచాడు వెంపల్లి గ్రామానికి చెందిన ఆరె శ్రీనివాస్‌ (టవర్‌ శ్రీను). తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి ఐక్యంగా ఉద్యమించాలని డిమాండ్‌ చేస్తూ 2011 సెప్టెంబర్‌ 22న హైదరాబాద్‌లో హోర్డింగ్‌ పైకి ఎక్కి ఆత్మహత్యకు యత్నించి 14 గంటల పాటు ఉత్కంఠకు తెరతీశాడు. తెలంగాణ ఐకాస నేత కోదండరామ్‌, గద్దర్‌ హామీతో కిందకు దిగివచ్చాడు. ఫిబ్రవరి 22న మంచిర్యాలలో ఐబీ వద్ద హోర్డింగ్‌ ఎక్కి రోజంతా పైనే ఉన్నాడు. అప్పట్లో నిజామాబాద్‌కు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే రాజీనామా చేయడం సంచలనం కలిగించింది. వీటితో పాటు మంచిర్యాలలో రైల్‌రోకో నిర్వహించి కేసుల పాలయ్యాడు. తెలంగాణ ఉద్యమంలో తనదైన శైలిలో చురుకై న పాత్ర పోషించాడు టవర్‌ శ్రీనివాస్‌.

Advertisement
 
Advertisement
Advertisement