తొలి, మలిదశ ఉద్యమంలో.. | - | Sakshi
Sakshi News home page

తొలి, మలిదశ ఉద్యమంలో..

Jun 3 2026 11:44 PM | Updated on Jun 3 2026 11:44 PM

మంచిర్యాలఅర్బన్‌: తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో క్రియశీలకంగా వ్యవహరించారు మంచిర్యాలకు చెందిన కవి మలయశ్రీ. తన కవితాగానంతో ఉద్యమ కారుల్లో ఉత్తేజాన్ని నింపారు. పెన్నుతోనే కాకుండా ప్రజలతో మమేకమై క్రియశీలకంగా ప్రత్యక్ష ఉద్యమాల్లో పాల్గొనే కవులు అరుదు. 65 ఏళ్ల వయస్సుల్లో కూడా తెలంగాణ జేఏసీలో చురుకై న బాధ్యతలు నిర్వర్తించారు. జిల్లా నుంచి హస్తీనా వరకు జరిగిన ధర్నా, పోరుబాటలో పాలుపంచుకున్నారు. జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ పిలుపుమేరకు రైలురోకో చేపట్టి అప్పటి టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు పురాణంతో కలిసి అరెస్ట్‌ అయ్యారు. ఢిల్లీ కేంద్రంగా నిర్వహించిన సత్యగ్రహ దీక్షలో ప్రొఫెసర్‌ కోదండరాంతో పాల్గొని తన యొక్క ఉద్యమ స్ఫూర్తిని చాటారు.

Advertisement
 
Advertisement
Advertisement