బెల్లంపల్లి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బెల్లంపల్లికి ఎంతో ప్రత్యేకత ఉంది. 2009 నవంబర్ నుంచి 2012 వరకు అలుపెరగని పోరాటాలు చేశారు. హైదరాబాద్–న్యూఢిల్లీ ప్రధాన రైల్వే మార్గం బెల్లంపల్లి మీదుగా వెళ్తుండటంతో రైల్వేస్టేషన్ పోరాట కేంద్రమైంది. జేఏసీ పిలుపుతో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఎదురెల్లి నిరసనలు తెలిపారు. కన్నాల బస్తీ నుంచి మొదలుకుని బెల్లంపల్లి రైల్వే స్టేషన్ వరకు దాదాపు 4 కిలోమీటర్ల దూరం వరకు రైలు పట్టాలపై బైఠాయించారు. ఘటనలో 19 మందిపై 12 రైల్వే కేసులు నమోదయ్యాయి.


