శాంతిభద్రతల పరిరక్షణలో కీలకపాత్ర | - | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతల పరిరక్షణలో కీలకపాత్ర

Jun 3 2026 11:38 PM | Updated on Jun 3 2026 11:38 PM

మంచిర్యాలక్రైం: శాంతిభద్రతల పరిరక్షణలో బ్లూ కోల్ట్స్‌, పెట్రో కార్‌ పోలీస్‌లది కీలక పాత్ర అని రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ అదనపు డీసీపీ శ్రీనివాస్‌ అన్నారు. కమిషనరేట్‌ ఆవరణలో బుధవారం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల బ్లూ కోల్ట్స్‌, పెట్రో కార్‌ సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంత తక్కువ సమయంలో ఘటన స్థలానికి చేరుకుంటే అంత మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. అనుమానితులు, రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘా పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లూ కోల్ట్ప్‌, పెట్రో కార్ల, వర్టికల్‌ ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌గౌడ్‌, సీసీ ఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ అనిల్‌కుమార్‌, బాబురావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement