జన్నారం: వరి కొయ్యలు కాలిస్తే భారీ జరిమానా విధిస్తామని ఏడీఏ కృష్ణ అన్నారు. మండలంలోని చింతగూడ రైతువేదికలో బుధవారం రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి కొయ్యలు, పంట అవశేషాలు కా ల్చడం వల్ల పంటలకు మేలు చేసే సూక్ష్మ జీవులు మృతి చెందుతాయని, సేంద్రియ ఆకర్షణ శాతం తగ్గి పంట దిగుబడిలో రైతు నష్టపోయే అవకాశాలు ఉన్నాయన్నారు. పంట పొలాల్లో మంట పెట్టడం ద్వారా నేల కాలుష్యం, వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందన్నారు. పంట పొలాల్లో మంటలు పెట్టిన వారిపై రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు జరి మానా విధించనున్నట్లు తెలిపారు. సమావేశంలో మండల వ్యవసాయ అధికారి అజిత్‌కుమార్, చింతగూడ ఏఈవో లవన్ కృష్ణ, రైతులు పాల్గొన్నారు.
నేషనల్ క్రికెట్ లీగ్‌కు ఎంపిక
ఆసిఫాబాద్‌రూరల్: ఆసిఫా బాద్ మండలంలోని బాబా పూర్ గ్రామానికి చెందిన శ్రీ చంద్ నాయక్ నేషనల్ క్రికెట్ లీగ్‌కు ఎంపికై నట్లు కుటుంబ సభ్యులు తెలిపా రు. ఇటీవల హైదరాబాద్‌లోని సెంచూరియన్ మైదా నంలో నిర్వహించిన అండర్ 16 క్రికెట్ పోటీల్లో సదరు విద్యార్థి ఎంపికై నట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు శ్రీచంద్ నాయక్‌ను అభినందించారు.


