చెన్నూర్‌రూరల్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మండలంలోని సుబ్బరాంపల్లికి చెందిన బిల్కి మహేశ్ అమరుడయ్యాడు. ఆటో డ్రైవర్‌గా పనిచేసే మహేశ్ 2010, ఫిబ్రవరి 5న చెన్నూర్‌లో డ్రైవర్లు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా తీసిన ర్యాలీలో పాల్గొని ఒక్కసారిగా జైతెలంగాణ అంటూ అకస్మాత్తుగా కుప్పకూలాడు. అతని తండ్రి మల్లేశ్ అనారోగ్యంతో చనిపోయాడు. ఇప్పటి వరకు ఎలాంటి సహాయం అందలేదని మహేశ్ తల్లి కౌసల్య తెలిపారు.
బావురావుపేటలో
బావురావుపేటకు చెందిన ముత్యాల రాజాగౌడ్ 2009, డిసెంబర్ 8న ఉరేసుకున్నాడు. అతనికి భార్య సుశీల, కుమారుడు సత్యనారాయణ, కూతురు స్వప్న ఉన్నారు. ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని, తెలంగాణ అమరులుగా గుర్తించి అన్ని విధాల ఆదుకోవాలని కోరారు.
మహేశ్ ఫొటోతో తల్లి కౌసల్య


