రామకృష్ణాపూర్: అంతర్జాతీయ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మందమర్రి మండలం బొక్కలగుట్టలోని గాంధారి వనంలో బుధవారం అటవీ శాఖ ఆధ్వర్యంలో సైకిల్ పోటీలు(సైక్లోథాన్) నిర్వహించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పోటీలను జిల్లా జడ్జి వీరయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజూ 15నిమిషాలపాటు సైక్లింగ్ చేయడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు. వాహనాల వినియోగా న్ని తగ్గించి సైకిళ్ల వాడకం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని సూచించారు. ఐఎఫ్‌ఎస్ అధికా రులు, జడ్జి కూడా సైక్లింగ్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌ఎస్, ఎఫ్‌డీపీటీ శాంతారామ్, డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్, ఎఫ్‌డీఓ సర్వేశ్వర్, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, ఎఫ్‌ఆర్‌వో రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.


