బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరా కోసం ఉద్దేశించిన అమృత్ 2.0 గోదావరి నీటి పథకం పనులు సత్వరంగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య ఆదేశించారు. బుధవారం ఆయన మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి, కమిషనర్ తన్నీరు రమేష్‌తో కలిసి పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. నీటి పథకం పనులు నత్తనడకన సాగుతుండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డు కోసం రెండు చోట్ల స్థలాలు పరిశీలించారు. పట్టణ సమస్యలపై చైర్‌పర్సన్, కౌన్సిలర్లు వినతిపత్రం అందజేశారు. తహసీల్దార్ ఎల్.కృష్ణ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.


