నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు

Jun 3 2026 11:38 PM | Updated on Jun 3 2026 11:38 PM

వేమనపల్లి: వైద్య సిబ్బంది విధులను నిర్లక్ష్యం చేసినా, సమయపాలన పాటించకపోయినా శాఖాపరమైన చర్యలు తప్పవని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సుధాకర్‌నాయక్‌ హెచ్చరించారు. ‘పీహెచ్‌సీ ఎదుట రోగుల నిరసన’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. వేమనపల్లిలోని పీహెచ్‌సీని సందర్శించి సిబ్బందితో అత్యవసర సమావేశం నిర్వహించారు. సీహెచ్‌సీగా అప్‌గ్రేడ్‌ అవుతున్న సందర్భంలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కుదరదని అన్నారు. సిబ్బంది కొరతను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఎండాకాలం వడదెబ్బ తగిలితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు రాజేష్‌, అన్వేష్‌, సీహెచ్‌ఓ పుట్టా సత్తయ్య, హెచ్‌ఏఒ శ్రీనివాస్‌, హెచ్‌ఎస్‌ అపరంజి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement