జైపూర్: ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం మండలంలోని ఇందారంలో ఓం, అన్నపూర్ణ రైస్‌మిల్లులు, సుముఖ గోదాం సందర్శించారు. రైస్‌మిల్లుల్లో ధాన్యం దిగుమతులు పరిశీలించి నిర్వాహకులకు సూచనలు చేశారు. బెజ్జాల, కిష్టాపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లు పరిశీలించారు. జాప్యం లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. ఈ ఏడాది లక్షా 60వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. హమాలీల సమస్యను అధిగమించడానికి స్థానికంగా హమాలీలను తీసుకుని ధాన్యం ఎగుమతి, దిగుమతి వేగవంతం చేయాలని తెలిపారు. తహసీల్దార్ వనజారెడ్డి పాల్గొన్నారు.


