అభాగ్యులు | - | Sakshi
Sakshi News home page

అభాగ్యులు

Apr 26 2026 2:45 AM | Updated on Apr 26 2026 2:45 AM

ఎవరికి పట్టని అభాగ్యులు ● వెల్లడించిన ఎస్పీ నితిక పంత్‌ ● పేద విద్యార్థులకు ఉచిత శిక్షణ ● పాలిటెక్నిక్‌ కళాశాల అధ్యాపకుల స్వచ్ఛంద నిర్ణయం అసలే ఎండాకాలం..ఆపై వేసవి వేడిమి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎక్కడి నుంచి వచ్చారో కాని అభాగ్యులు నిర్మల్‌ జిల్లాకేంద్రంలోని రోడ్ల పక్కన ఉంటూ కాలం గడుపుతున్నారు. ఎన్టీఆర్‌ మినీట్యాంక్‌ బండ్‌పై రోడ్డు మధ్య డివైడర్ల చెట్ల కింద సేద తీరుతున్నారు. ఎవరైనా దయతలిస్తేనే వారి కడుపునిండేది. లేదంటే పస్తులే. ఏ ఆశ్రయం లేక ఎక్కడ తలదాచుకోవాలో తెలియని పరిస్థితి. మున్సిపల్‌ అధికారులు అభాగ్యులను చేరదీసి పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, నిర్మల్‌

ఎవరికి పట్టని

పాలి‘సెట్‌’ సాధించేలా..

బెల్లంపల్లి: సాంకేతిక విద్య అభ్యసించాలని కుతూహలం ఉన్న విద్యార్థులు పాలిసెట్‌లో నెగ్గేలా బెల్లంపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల అధ్యాపకులు స్వచ్ఛందంగా ముందుకువచ్చి ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 16న ప్రారంభమైన శిక్షణ తరగతులు మే 11వరకు నిర్వహించనున్నారు. 13న పాలిసెట్‌–2026 జరగనుంది. 2025–26 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఎస్టీ, ఎ స్సీ, బీసీ గురుకులాల్లో పదోతరగతి పూర్తి చేసిన వందమంది నిరుపేద విద్యార్థులకు కళాశాల ప్రిన్సి పాల్‌ దేవేందర్‌ పర్యవేక్షణలో శిక్షణ ఇస్తున్నారు.

సబ్జెక్టులపై

పట్టుసాధించేలా...

శిక్షణ తరగతులను మారుమూల గ్రామీణ ప్రాంత విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. సి ర్పూర్‌(టి), కాగజ్‌నగర్‌, సిర్పూర్‌ (యూ), ఆసిఫా బాద్‌, రెబ్బెన, తాండూర్‌, బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, శ్రీరాంపూర్‌, కాసిపేట, నెన్నెల, తది తర మండలాల విద్యార్థులు శిక్షణకు హాజరవుతున్నారు. సబ్జెక్టులపై పట్టుసాధించేలా ఉదయం 9 ను ంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శిక్షణ ఇస్తూ నే నిర్ధేశించిన పరీక్ష సమయంలో ఎక్కువ మార్కులు స్కోర్‌ చేసే విధంగా మెలకువలు నేర్పిస్తున్నారు.

కోర్సులపై అవగాహన

పాలిటెక్నిక్‌లో ఏఏ కోర్సుల్లో ఉన్నాయి.. ఏ కోర్సులో చేరితే ఉద్యోగావకాశాలు ఉంటాయి.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తట్టుకునే తీరు, తదితర అంశాల్లో అవగాహన కల్పిస్తున్నారు. మైనింగ్‌, ఈఈఈ, కంప్యూటర్‌ సైన్స్‌, ఈసీఈ, ఏఐ, ఆటోమేషన్‌ రోబోటిక్‌, తదితర కోర్సులను వివరిస్తున్నారు.

సమాన స్థాయిలో హాజరు...

కళాశాలలో మూడేళ్ల క్రితం ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించారు. మొదటిసారి 2024లో 60 మంది విద్యార్థులు శిక్షణ తరగతులకు హాజరుకాగా పాలిసెట్‌లో 40 మంది ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత అప్పటి అధ్యాపకుల్లో కొందరు బదిలీపై వెళ్లగా రెండేళ్ల పాటు శిక్షణ తరగతులు నిలిపివేశారు. ప్రస్తుతం ప్రభుత్వం సాంకేతిక విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తుండడంతో అధ్యాపకుల్లో ఉచితంగా బోధించాలనే జిజ్ఞాస ఏర్పడి ఈ ఏడాది నుంచి ఉచిత శిక్షణ తరగతులకు శ్రీకారం చుట్టినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ దేవేందర్‌ పేర్కొన్నారు. కాగా ఈ శిక్షణ తరగతులకు బాలబాలికలు సమాంతరంగా హాజరవుతుండడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement