రైల్వేస్టేషన్‌కు దినాం వందల మంది ప్రయాణికులు వచ్చి రైలెక్కి వెళ్లిపోతుంటారు. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. తాగునీరు లేకపోతే గొంతెండి ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటున్నాయి. ప్రయాణికుల కోసం చర్యలు తీసుకోవాల్సిన రైల్వే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచిదికాదు. వెంటనే స్పందించి చల్లని నీటిని ఏర్పాటు చేయించాలి. – జనార్థన్, రైలు ప్రయాణికుడు
వేడినీళ్లు తాగుతున్నం
రైల్వేస్టేషన్‌లో చల్లని నీటి సదుపాయం లేదు. ట్యాప్ ఆన్ చేసి చూస్తే వేడి నీళ్లు వస్తున్నాయి. ఆ నీటిని ఎండాకాలంలో తాగలేకపోతున్నాం. చల్లని నీరు లభించకపోవడంతో అల్లాడిపోయే పరిస్థితులు ఉన్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు తట్టుకోలేకపోతున్నారు. రైల్వే ఫ్లాట్‌ఫామ్‌లపై చల్లని నీటి సౌకర్యం కల్పించడానికి రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలి.
– మురహరి, రైలు ప్రయాణికుడు


