మంచిర్యాలఅర్బన్: కాకతీయ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల డిగ్రీ పరీక్షల జవాబు పత్రాల ఆన్‌లైన్ మూల్యాంకనంపై బుధవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన కల్పించారు. ఈ ఏడాది నుంచి డిగ్రీ సెమిస్టర్ల జవాబు పత్రాల మూల్యాంకనం ఆన్‌లైన్‌లో చేపట్టనున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం అదనపు పరీక్షల నియంత్రణాధికారి తిరుమలదేవి మాట్లాడుతూ పరీక్షల విభాగంలో నూతన సంస్కరణలు చేపడుతున్నామని, ఇందులో అన్ని కళాశాలలు భాగస్వామ్యం కావాలని అన్నారు. మూల్యాంకనం త్వరగా పూర్తయి సకాలంలో ఫలితాలు విడుదల అవుతాయని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ జై కిషన్ ఓజా అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో కాకతీయ అదనపు పరీక్షల నియంత్రణాధికారి వెంకటయ్య, సూపరింటెండెంట్ ప్రతాప్, టెక్నికల్ అసిస్టెంట్లు విజయకుమార్, విష్ణు పాల్గొన్నారు.


