లక్సెట్టిపేట: గొల్లపల్లి మండలం ధనురుకు చెందిన కొల్లూరి భాగ్యలక్ష్మి గురువారం పని నిమిత్తం ఉట్నూర్‌కు వెళ్ళింది. తిరుగుప్రయాణంలో మంచిర్యాల వెళ్లే బస్సు ఎక్కి లక్సెట్టిపేటలో దిగింది. తన బ్యాగ్ బస్సులోనే మరిచిపోవడంతో వెంటనే లక్సెట్టిపేట పోలీసులకు సమాచారం అందించింది. బ్లూ కోర్టు విధులు నిర్వహిస్తున్న ఎంబడి సత్యనారాయణ, రాజేందర్ వెంటనే మంచిర్యాల బస్టాండ్‌కు వెళ్లి డిపో మేనేజర్‌తో మాట్లాడి బ్యాగును తెప్పించి బాధితురాలికి అప్పగించారు. బ్యాగులో బంగారంతో పాటు నగదు కూడా ఉన్నట్లు బాధిత మహిళ పేర్కొంది.


