ఆత్మీయ సమ్మేళనానికి సీఎండీకి ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ఆత్మీయ సమ్మేళనానికి సీఎండీకి ఆహ్వానం

Apr 3 2026 7:38 AM | Updated on Apr 3 2026 7:38 AM

శ్రీరాంపూర్‌: పట్టణంలోని ప్రగతి మైదానంలో ఈ నెల 19న నిర్వహించనున్న ఉద్యోగ, అధికారులు, క్రీడాకారులు, కళాకారుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని నిర్వాహకులు సీఎండీని కోరారు. గురువారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సంస్థ సీఎండీ బుద్దప్రకాశ్‌ జ్యోతి చేతుల మీదుగా కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ మైదానంలో ఆడిన ఎంతోమంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించారన్నారు. కళాకారులకు కూడా గొప్ప వేదికై ందన్నారు. కార్మికులు, అధికారులు ప్రతీరోజు వ్యాయామం చేయడానికి ఈ మైదానానికే వస్తారన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు వై.యాదిరెడ్డి, శ్యాంసుందర్‌, పీ.సంపత్‌కుమార్‌, ప్రేంకుమార్‌, లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement