కాసిపేట: మండలంలోని సోమగూడెం(కె) గ్రామ పంచాయతీలోని ట్యాంకుబస్తీ, ఎన్‌టీఆర్ కాలనీలను ముంపు గ్రామాలుగా ప్రకటించాలని గురువారం నిర్వహించిన గ్రామసభలో గ్రామస్తులు, సర్పంచ్, వార్డుసభ్యులు తీర్మానం చేశారు. ఓసీ ప్రాజెక్టు పేలుళ్లకు ఇళ్లు పగుళ్లు తేలుతున్నాయని, దుబ్బగూడం మాదిరి పునరావాసం కల్పించి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందించాలని కోరారు. ఎమ్మెల్యే, ఎంపీ స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చైతన్య ప్రవీణ్ నాయక్, ఉపసర్పంచ్ మల్యాల స్రవంతి, పంచాయతీ కార్యదర్శి కీర్తి, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు సంకె రవి, కనుకుల రాకేష్, శ్రీనివాస్, తోడేటి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


