లారీ రూపంలో కబళించిన మృత్యువు టేకుమట్ల వద్ద బైక్‌ను ఢీకొట్టిన లారీ రంజాన్ వేడుకలకు వెళ్లి వస్తుండగా ఘటన మిన్నంటిన తల్లి, బంధువుల రోదనలు
జైపూర్: నాడు తండ్రి, నేడు కొ డుకు లారీ రూపంలో మృత్యు వు కబళించింది.ఊహించని ప్ర మాదం ఆ కుటుంబలో తీరని విషాదం మిగిల్చింది. పదేళ్ల క్రితం తండ్రిని లారీ ప్రమాదంలో మృతిచెందగా, ఇప్పుడు కుమారుడి బైక్‌ను లారీ ఢీకొట్టిన ఘటనలో మరణించాడు. జైపూర్ మండలం టేకుమట్ల వాగు బ్రిడ్జి వద్ద శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. స్థానికులు, బంధవులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగుండానికి చెందిన లక్ష్మి–మల్లేశ్ దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్నవాడు పోరడ్ల సాయికుమార్(23) హైదరాబాద్‌లో ప్రైవేట్ కంపెనీలో మెడికల్ రిప్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఉగాది పండుగ కోస ం ఇంటికి వచ్చిన ఆయన ఇక్కడే రెండ్రోజులుగా ఉన్నాడు. తన అమ్మమ్మ స్వగ్రామం జైపూర్ మండలం కుందారం. తన చిన్ననాటి స్నేహితుడి ఇంట్లో శనివారం రంజాన్ వేడుకలకు హాజరయ్యేందుకు బైక్‌పై వచ్చి తిరిగివెళ్తున్నాడు. ఇందారం నుంచి హైవే రోడ్డుకు మట్టి లోడుతో వెళ్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సాయికుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. కొడుకు మృతి వార్త తెలియగానే తల్లి గుండెపగిలేలా రోదించింది. లారీ అతివేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుందని బాధిత కుటుంబానికి రూ.50లక్షల పరిహారమివ్వాలని బంధువులు డిమాండ్ చేశారు. ఘటనస్థలం వద్ద మృతదేహంతో రాత్రివరకు రా స్తారోకో చేపట్టారు. హైవేరోడ్డు పనులు చేపడుతున్న కంపెనీతో కుటుంబీ కులు రాత్రివరకు చర్చలు జరిపారు. ఈమేరకు కే సు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.


