మద్యానికి బానిసై వృద్ధుడు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

మద్యానికి బానిసై వృద్ధుడు ఆత్మహత్య

Mar 22 2026 5:33 AM | Updated on Mar 22 2026 5:33 AM

సారంగపూర్‌: మద్యానికి బానిసై వృద్ధుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వి వరాల ప్రకారం.. మండలంలోని చించోలి(బి) గ్రా మానికి చెందిన పల్లెర్ల పె ద్ద సాయన్న(61) గత కొ ంతకాలం క్రితం అప్పులపాలై ఉన్న ఇల్లు అమ్ముకున్నాడు. గత మూడు నెలలుగా ఎలాంటి పని చేయకుండా ఆర్థిక పరిస్థితి బాగోలేని కారణంగా మద్యానికి బానిసయ్యాడు. శనివారం స్థానిక కల్లు దుకా ణంలో అధిక మద్యం తాగాడు. ఆ మత్తులో గ్రామశివారు ఆర్టీఓ కార్యాలయం సమీపంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. స్థానికులు గుర్తించి కుటుంబీకులు, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శ్రీకాంత్‌ వెంటనే ఘటనస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్‌ ఏరియాస్పత్రికి తరలించారు. భార్య నర్సవ్వ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దకుమారుడు ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ దేశంలో ఉండగా చిన్నకుమారుడు నిర్మల్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.

ఉరేసుకుని సింగరేణి రిటైర్డ్‌ కార్మికుడు..

తాండూర్‌: మండలంలోని తంగళ్లపల్లి గ్రామానికి చెందిన జాడి మొండయ్య(80) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై ప్రసాద్‌ కథనం ప్రకారం.. జాడి మొండయ్య సింగరేణిలో ఉద్యోగ విరమణ చేసిన అనంతరం కుమారుడు పోశం వద్ద ఉంటున్నాడు. రెండేళ్ల క్రితం పక్షవాతం రావడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. శనివారం బాత్రూం వెళ్లిన మొండయ్య ఎంత సేపటికి బయటకు రాలేదు. తలుపు బద్దలుకొట్టి చూడగా బాత్రూంలో ఉన్న రాడ్‌కు ఉరేసుకున్నాడు. కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుమారుడి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement