నీటి గుంతలో పడి వృద్ధుడి మృతి | - | Sakshi
Sakshi News home page

నీటి గుంతలో పడి వృద్ధుడి మృతి

Mar 22 2026 5:33 AM | Updated on Mar 22 2026 5:33 AM

● జిల్లాకేంద్రంలో ఘటన

నెన్నెల: మండలంలోని కొనంపేట శివారు చిన్నవాగులో జేసీబీతో తవ్విన నీటి గుంతలో పడి వృద్ధుడు మృతిచెందాడు. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. కొనంపేటకు చెందిన డోలె బక్కయ్య(63) శుక్రవారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లాడు. పొద్దుపోయినక నీటిగుంతలో విగత జీవిగా ఉన్న బక్కయ్యను చూసిన యువకులు కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ప్రమాదవశాత్తు కాలు జారి నీటిగుంతలో పడి మరణించి ఉంటాడని భావిస్తున్నారు. మృతుడి కుమారుడు మల్లయ్య శనివారం ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

వలస కూలీ దారుణహత్య

మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలో వలస కూలీ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. సీఐ ప్రమోద్‌రావు కథనం ప్రకారం.. స్థానిక చిందం శ్రీనివాస్‌ అనే బిల్డర్‌ వద్ద మహారాష్ట్రకు చెందిన దీపక్‌ (35)తోపాటు మరో ఇద్దరు కాంక్రీట్‌ మిల్లర్‌ పని చేస్తున్నారు. జిల్లాకేంద్రంలోని కాలేజీరోడ్‌ వైన్స్‌ సమీపంలో ఓ ఇంట్లో ముగ్గురు అద్దెకుంటున్నారు. శుక్రవారం పనికి వెళ్లి ఇంటికి వచ్చిన ముగ్గురు మద్యం మత్తులో గొడవపడినట్లు తెలిసింది. మరో ఇద్దరు రాడ్‌తో దీపక్‌పై దాడి చేసి పారిపోయారు. రక్తపు మడుగులో ఉన్న దీపక్‌ను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రాత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శనివారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీపక్‌తోపాటు ఉన్న మరో ఇద్దరు స్నేహితులు. ఒకరు మహారాష్ట్ర ఐరి రాంపూర్‌కు చెందిన దీపక్‌, మరొకరు కాసిపేట మండలం పల్లంగూడ గ్రామానికి సంజీవ్‌గా గుర్తించారు. ఇద్దరు కనిపించకపోవడంతో వారిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులు గాలిస్తున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement