యాపలగూడ టూ కలెక్టరేట్‌ | - | Sakshi
Sakshi News home page

యాపలగూడ టూ కలెక్టరేట్‌

Mar 22 2026 5:33 AM | Updated on Mar 22 2026 5:33 AM

● సౌకర్యాల కోసం గిరిజనుల పాదయాత్ర

పెంబి: తమ గ్రామంలో కనీస సౌకర్యాలు కల్పించాలని మండలంలోని యాపలగూడ గ్రామస్తులు కలెక్టరేట్‌కు శనివారం పాదయాత్రగా బయల్దేరారు. కడెం వాగు నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు పాదయాత్రను సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టారు. రాష్ట్ర కార్యదర్శి బండారి రవికుమార్‌ ప్రారంభించారు. రెండు రోజుల్లో నిర్మల్‌కు చేరుకుంటుందని తెలిపారు. గిరిజనుల సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. మారుమూల పెంబి మండలంలోని 15 గ్రామాలకు రోడ్డు, తాగునీరు, కరెంట్‌ సౌకర్యం లేవని తెలిపారు. ఎన్నికలప్పుడు వచ్చే నాయకులు, ప్రజాప్రతినిధులు తర్వాత ఇటువైపు కన్నెత్తి చూడడం లేదని విమర్శించారు. దోత్తి, కడెం వాగులపై, పస్పుల వాగుపై వంతెనలు నిర్మించినా వరద దాటికి కొట్టుకుపోయాయన్నారు. మూడేళ్లయినా కొత్తవి నిర్మించడం లేదని తెలిపారు. పుల్గంపాండ్రి నుంచి సిరిచెల్మ వరకు రోడ్డు నిర్మాణం చేపడితే మండల ప్రజలకు ఆదిలాబాద్‌కు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందన్నారు. రాష్ట్రకమిటీ సభ్యులు ఉడత రవీందర్‌, పూసం సచిన్‌, జిల్లా కార్యదర్శి గౌతంకృష్ణ, సీపీఎం జిల్లాకార్యదర్శి నూతన్‌కుమార్‌, బొమ్మెన సురేశ్‌, వ సుధ, జిల్లాకమిటీ సభ్యులు తోడసం శంభు, కామా క్షి, నాగెల్లి, నర్సయ్య, ఆదివాసీలు పాల్గొన్నారు.

పాదయాత్రగా బయల్దేరిన గిరిజనులు, నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement