మంచిర్యాలటౌన్: ఓట్లు నష్టపోతామని అభివృద్ధిని ఆపలేమని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు పేర్కొన్నారు. నగరంలోని మా ర్కెట్ ఏరియాలో రోడ్డు వెడల్పు పనుల్లో భా గంగా ఆక్రమణల కూల్చివేతలను శనివారం పరిశీలించారు. హిందూ పండుగల నేపథ్యంలోనే రాజకీయ కక్షతోనే మార్కెట్‌లో కూల్చివేతలు చేపడుతున్నట్లు ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్న ఆరోపణలు ఖండించారు. రూ.78కోట్లతో పూర్తిస్థాయిలో రోడ్ల వెడల్పు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, అండర్ గ్రౌండ్ వి ద్యుత్ కనెక్షన్ పనులు చేపడుతున్నట్లు తెలిపా రు. రోడ్డు వెడల్పు పనులతో గతంతో పోలిస్తే వ్యాపారం మరింత పెరిగిందని, జీఎస్టీ లెక్క లే ఇందుకు నిదర్శనమని తెలిపారు. మంచిర్యాల ఫైర్‌స్టేషన్ ఉన్న భూమి ప్రభుత్వానికి సంబంధించిందని, ఆరు ఫైరింజన్లను అందుబాటులో ఉంచేందుకే నస్పూరు లేదా గుడిపేట్‌కు దానిని తరలించాలని చూస్తున్నామని పేర్కొన్నారు. ఫైర్‌స్టేషన్ స్థలం ఫారెస్ట్ డిపార్టుమెంట్‌కు ఇచ్చి, ప్రస్తుత ఫారెస్ట్ కార్యాలయమున్న చోట కార్పొరేషన్ షాపింగ్ కాంప్లె క్స్ నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నట్లు తెలి పారు. ప్రభుత్వ భూములు తాను స్వాధీనం చేసుకుంటున్నట్లు మాజీ ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు.


