బెల్లంపల్లి: సింగరేణిని కాపాడుకోవడం ప్రధాన లక్ష్యమని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేణ శంకర్ అన్నారు. భారత కమ్యూనిస్టుపార్టీ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన సేవ్ సింగరేణి బస్సుజాత శనివారం రాత్రి బె ల్లంపల్లికి చేరింది. బీఆర్ అంబేడ్కర్(కాంటా) చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు. ఈ నెల 30న కొత్తగూడెంలో నిర్వహించనున్న ము గింపు సభను విజయవంతం చేయాలని కోరారు. సభలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ డెప్యూటీ కార్యదర్శి వైవీరావు, కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు వెంకటస్వామి, బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


