పార్టీ సిద్ధాంతాలపై అవగాహన ఉండాలి | - | Sakshi
Sakshi News home page

పార్టీ సిద్ధాంతాలపై అవగాహన ఉండాలి

Mar 22 2026 5:32 AM | Updated on Mar 22 2026 5:32 AM

చెన్నూర్‌: బీజేపీ సిద్ధాంతాలపై ప్రతీ కార్యకర్త కు అవగాహన ఉండాలని పార్టీ జిల్లా అధ్యక్షు డు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ సూచించారు. స్థానిక ఫంక్షన్‌హాల్‌లో శనివారం రాత్రి కోటపల్లి, వేమనపల్లి మండలాల బూత్‌స్థాయి అధ్యక్షులకు ఏర్పాటు చేసిన ఒక్కరోజు శిక్షణ తరగతులను ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా ఇస్తున్న శిక్షణ తరగతుల్లో భాగంగా చెన్నూర్‌లో శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్‌, కార్యదర్శి రత్న లక్ష్మీనారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు పట్టి కృష్ణ, చెన్నూర్‌ పట్టణాధ్యక్షుడు తుమ్మ శ్రీపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement